Bhatti Vikramarka : దొర పాలనలో రాష్ట్రం ఆగమాగం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. నీళ్లు లేవు , నిధులు లేవు, నియామకాలు అసలే లేవని ఆవేదన చెందారు. అరాచకత్వం, మోసం, కుట్ర, అవినీతి, డ్రగ్స్, మాఫియా, రియల్ దందాకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఆరోపించారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). రైతు బంధు పేరుతో సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
సీఎల్పీ నేత చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర ప్రస్తుతం కొనసాగగుతోంది. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కోలుకున్నారు తిరిగి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. స్వరాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
పండించిన పంట చేతికి రాక, అప్పులు పుట్టక, ప్రభుత్వం ఆదుకోక పోవడంతో రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని అయినా కేసీఆర్ కు బుద్ది రావడం లేదన్నారు. సోయి తప్పి ఫామ్ హౌస్ లో పడుకుంటున్న కేసీఆర్ కు ఇప్పుడు అమరులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.
రైతే రాజు అన్నది కేవలం పాలకుల నినాదంగా మారి పోయిందన్నారు మల్లు భట్టి విక్రమార్క. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించిన పాపాన పోలేదన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
Also Read : Sanju Samson : ఎట్టకేలకు శాంసన్ కు ఛాన్స్