Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారిని దర్శించుకున్న 87,407 భక్తులు
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత నెల రోజులుగా నిత్యం భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. సెలవులు పూర్తయినా ఇంకా తాకిడి పెరగడం విశేషం. ఆదివారం భారీ ఎత్తున శ్రీవారిని దర్శించు కోవడం విశేషం. 87 వేల 407 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం 75 వేల మందికి పైగా దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా 31 వేల 713 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలు ఏకంగా 4 కోట్ల 47 లక్షల ఆదాయం సమకూరింది. కాగా తిరుమల లోని 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనం కోసం 12 గంటల సమయం పట్టనుంది. ఇదిలా ఉండగా శ్రీనివాస మంగాపురంలో కల్యాణ వేంకటేశ్వర స్వామి సాక్షాత్కార బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక అధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పర్యావరణ రక్షణకు ఎక్కువగా ఫోకస్ పెట్టారు చైర్మన్, ఈవో .
మరో వైపు శ్రీవాణి ట్రస్టుకు భారీ ఎత్తున నిధులు సమకూరినట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. కొందరు కావాలని బురద చల్లేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఎవరైనా ఎప్పుడైనా తమ వద్దకు రావచ్చని, క్లియర్ గా వివరాలు తమ వద్ద ఉన్నాయని, అందజేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read : Dasoju Sravan : రేవంత్ బీజేపీ కోవర్ట్ – శ్రవణ్