MK Stalin Modi : మోదీ కామెంట్స్ స్టాలిన్ సీరియస్
యూనిఫాం సివిల్ కోడ్ పై సీఎం ఫైర్
MK Stalin Modi : ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసి తీరుతామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) సీరియస్ గా స్పందించారు. ప్రధాన మంత్రిని టార్గెట్ చేశారు. దేశానికి బాధ్యత కలిగిన పీఎం స్థాయిలో ఉన్న మోదీ ఇలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ ను ముందుగా హిందువులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
మను వాదాన్ని సమర్థించేలా ఈ కోడ్ ఉందని ఆరోపించారు సీఎం. ఎస్సీలు, ఎస్టీలు సహా ప్రతి వ్యక్తి దేశంలోని ఏ గుడి లోకి వెళ్లి దర్శించుకునే అవకాశం కల్పించాలని ఆ పరిస్థితి ఇప్పుడు లేదని మండిపడ్డారు సీఎం. కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు స్టాలిన్. రాజ్యాంగం ఇప్పటికే ఉందని ఇక యూసీసీ అవసరం లేదని పేర్కొన్నారు.
దేశంలో పేరుకు పోయిన పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ముందుగా ప్రధాన మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎంకే స్టాలిన్. అసలు తన వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ఆడుతున్న నాటకం అంటూ మండిపడ్డారు. మణిపూర్ రావణ కాష్టంలా మండుతోంది. కానీ ఇప్పటి వరకు ప్రధాన మంత్రి మోదీ దాని గురించి నోరు మెదిపిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Maamannan Movie : మామన్నన్ చిత్రంపై ఉత్కంఠ