Bro Movie Teaser : పవన్ కళ్యాణ్ పేరు వింటేనే ఫ్యాన్స్ కు జోష్. ఆ పేరులో అదో గమ్మత్తు..అంతకు మించిన మ్యాజిక్ ఉండడంతో తాజాగా ఆయన నటించిన బ్రో మూవీకి సంబంధించి రిలీజైన ట్రైలర్ దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జూలై 28న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం బ్రో టీజర్(Bro Movie Teaser) పిచ్చెక్కించేలా చేస్తోందంటున్నారు అభిమానులు. ఇది వైరల్ గా మారింది. ఎప్పటి లాగే పవర్ ఫుల్ డైలాగులతో టీజర్ అదిరింది. తన మ్యానరిజంతో మరోసారి రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తుండగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ పవన్ కళ్యాణ్ కు తోడుగా నటిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే సముద్రఖని కథ, దర్శకత్వం బ్రో మూవీకి. సాయి ధరమ్ తేజ్ తో పాటు బ్రహ్మానందం కూడా నటించారు. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇది పూర్తిగా ఫాంటసీ, కామెడీ చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాశారు. స్క్రీన్ ప్లే రాశారు. 2021లో వచ్చిన తమిళ చిత్రం వినోదయ సితం కు రీమేక్. దీనికి సముద్రఖని దర్శకత్వంతో పాటు నటించారు.
Also Read : Karnataka HC Fine : ట్విట్టర్ కు రూ. 50 లక్షల జరిమానా