RS Praveen Kumar : తీరని దుఃఖం సాయిచంద్ మరణం
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : గాయకుడు సాయిచంద్ ను కోల్పోవడం ఉమ్మడి పాలమూరు జిల్లాకు, బహుజనుల జాతికి ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమానికి తీరని నష్టమని పేర్కొన్నారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సినీ , రాజకీయ ప్రముఖులు చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వం తన పాటను, తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకింత చేసిన సాయిచంద్ గుర్తుకు రాక పోవడం దారుణమన్నారు. దీనిని బహుజన, దళిత, మైనార్టీ , ఆదివాసీ బిడ్డలు గుర్తించాలని కోరారు ఆర్ఎస్పీ.
బీఎస్పీలోకి రావాలని కోరాను. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారైనా కూడా ఎందుకనో చివరి నిమిషంలో రాకుండా పోయిందని ఆవేదన చెందారు. సాయిచంద్ స్థానంలో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యిండని ఆరోపించారు. గాయకుడిని వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలంగాణ యావత్ సమాజానికి ఎరుకేనని పేర్కొన్నారు.
ఈ సంగతి తెలుసుకున్న నేను సాయిచంద్ తో మాట్లాడానని, వెంటనే బీఎస్పీలో చేరాలని కోరాను. తను కొంత కాలం తర్వాత వస్తానని చెప్పాడు. తీరా తరలిరాని లోకానికి వెళ్లి పోయాడని ఆవేదన చెందారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ఎలాంటి ప్రాధాన్యత లేని గిడ్డంగుల కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించారని ఆరోపించారు.
నాగర్ కర్నూల్ లో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ వైద్య సదుపాయాలు ఉండి ఉన్నట్లయితే సాయిచంద్ బతికి ఉండేవాడమేనని పేర్కొన్నారు. సమ సమాజం వైపు నడిపించే వాడేమోనని అన్నారు. అంబేద్కర్ భావ జాలానికి ఊపిరి పోసిన గాయకుడని కొనియాడారు.
Also Read : Bro Movie Teaser : పవన్ బ్రో టీజర్ వైరల్