CM YOGI : తాను మాటల మనిషిని కాదని చేతల మనిషినని నిరూపించుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. గతంలో నేరస్థులు, మాఫియాలకు అడ్డాగా ఉండేది యూపీ. కానీ ఇప్పుడు సీన్ మారింది. కనిపిస్తే కాల్చి పారేయాలని ఆదేశించారు సీఎం. దెబ్బకు చాలా మంది గ్యాంగ్ స్టర్లు లొంగి పోతున్నారు. మరికొందరు యూపీని వదిలేసి పారి పోతున్నారు. ఈ తరుణంలో మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ స్టర్లను లేపేశాక ఇప్పుడు యూపీలో యోగి పేరుతో జడుసుకుంటున్నారు నేరస్థులు. తమను చంపొద్దంటూ వేడుకుంటున్నారు.
ఈ తరుణంలో ఇటీవలే దారుణ హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్న స్థలంలో ప్రభుత్వమే ఫ్లాట్స్ ను నిర్మించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ఈ సందర్బంగా సీఎం ప్రసంగించారు.
ప్రస్తుతానికి 76 ఫ్లాట్స్ ఇస్తున్నామని మిగతా వాటిని కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. గతంలో బయటకు రావాలంటే జడుసుకునే వారు. గ్యాంగ్ స్టర్లు అరాచకాలకు పాల్పడ్డారు. ఆపై లెక్కలేనన్ని ఆస్తులను కొల్లగొట్టారు. వారి తాట తీసేందుకు తాను ఉన్నానని చెప్పారు యోగి ఆదిత్యానాథ్(CM Yogi). ఏ స్థాయిలో ఉన్నా ఎంతటి వారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలు సీఎం యోగి ఆదిత్యా నాథ్ కు ధన్యవాదాలు తెలిపాయి. ఆయన చొరవ వల్లనే ఇవాళ తాము స్వంత ఇళ్లలోకి వెళ్ల గలుగుతున్నామని పేర్కొన్నారు. ఆయన చల్లంగ ఉండాలని కోరారు.
Also Read : Rahul Gandhi : బాధితులకు రాహుల్ గాంధీ భరోసా