PM Modi : మానవీయ శాస్త్రాలకు అధిక ప్రాధాన్యత
భారతీయ చరిత్ర, సంస్కృతిపై ఆసక్తి
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్శిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత దేశం వైపు చూస్తోందన్నారు. ప్రధానంగా భారత దేశానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, నాగరికత గురించి తెలుసు కోవాలన్న ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందన్నారు. ఇది మనం సాధించిన ఘనతకు నిదర్శనమన్నారు.
దీని వల్ల మానవీయ శాస్త్రాలను అభ్యసించే వారికి అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఇది ఒకందుకు మంచి పరిణామమని పేర్కొన్నారు నరేంద్ర మోదీ(PM Modi). చరిత్ర అన్నది ప్రతి దేశానికి ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక భారతీయ సంస్కృతి, నాగరికతపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు. దీని వల్ల రాబోయే కాలంలో మనం ఏం కోల్పోయామో, ఏం సాధించామో తెలుసుకునే అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు.
కాగా అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తు పోయేలా చేశారు. సెంటినరీ ఉత్సవాలకు బయలు దేరిన ఆయన ఉన్నట్టుండి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ సామాన్య పౌరుడి లాగానే టికెట్ తీసుకున్నారు. మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఢిల్లీ యూనివర్శిటీకి చేరుకున్నారు.
Also Read : Eatala Rajender : జితేందర్ ట్వీట్ ఈటల కామెంట్