Jailer Movie Song : తలైవా జైలర్ సాంగ్ పై ఉత్కంఠ
జూలై 2న విడుదల చేసే అవకాశం
Jailer Movie Song : తమిళ సినీ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తలైవాకు ఒక్క తమిళనాడులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన జైలర్ కు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , టీజర్ , సాంగ్ కు భారీ ఆదరణ లభించింది. తాజాగా మరో పాటను సినిమాకు సంబంధించి రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూలై 2న ఆదివారం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక రజనీకాంత్ ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్ పోషిస్తున్నాడు. లుక్ కూడా ఆకట్టుకుంటోంది. జైలర్ కు నెల్సన్ దర్శకత్వం వహిస్తుండగా కళానిధి మారన్ నిర్మించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. జైలర్(Jailer) ను ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఆగస్టు 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
పాన్ ఇండియా మూవీగా రానుంది. నెల్సన్ తానే కథ రాసుకుని దర్శకత్వం వహించారు. ఇక రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ సినీ నటుడు జాకీ ష్రాఫ్ , కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ , తమన్నా భాటియా , సునీల్ , రమ్య కృష్ణన్ , వినాయకన్ , మర్నా మీనన్ , వసంత్ రవి సహాయక పాత్రల్లో నటించారు. మొత్తంగా తలైవా జైలర్ సాంగ్ పై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Jawan Music Rights : రూ. 36 కోట్లకు జవాన్ మ్యూజిక్ రైట్స్