Lucknow Court : ఆది పురుష్ నిర్మాతలకు కోర్టు షాక్
జూలై 27న హాజరు కావాలని ఆదేశం
Lucknow Court : ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ , ముద్దుగుమ్మ కృతీ సనన్ కలిసి నటించిన ఆది పురుష్ విడుదలైనా ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇతిహాసం రామాయణంలోని కొంత భాగాన్ని ఆధారంగా తీసుకుని దర్శకుడు సినిమాను చిత్రీకరించాడు. అయితే హిందూవాదులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కోట్లాది హిందువులు అభిమానించే దేవుళ్లను అవమానించారంటూ కేసు వేశారు. ప్రస్తుతం యూపీ లోని లక్నో కోర్టు(Lucknow Court) విచారిస్తోంది.
మరో వైపు అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు, నిర్మాతలు ఖురాన్ ను కూడా ఇలాగే మార్పులు చేసి తీసే ప్రయత్నం చేస్తారా అని నిలదీసింది.
ఈ తరుణంలో ఆది పురుష్ సినిమాపై విచారణ చేపట్టింది లక్నో కోర్టు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, ముందు జూలై 27న తమ ముందు హాజరు కావాలని కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతే కాకుండా నిర్మాతలతో పాటు దర్శకుడు ఓం రౌత్ , డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ కూడా రావాల్సిందేనంటూ కుండ బద్దలు కొట్టింది కోర్టు.
ఇదే సమయంలో ఆది పురుష్ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేసిన బోర్డు మెంబర్స్ ను కూడా వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది కోర్టు.
Also Read : Shatrughan Sinha : దర్యాప్తు సంస్థల పేరుతో వేధింపులు