Telangana Congress : తెలంగాణలో మార్పు ఖాయం – ఠాక్రే
3 కోట్ల 80 లక్షల మంది నిరీక్షణ
Telangana Congress : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు జన గర్జన సభగా నామకరణం చేశారు. భారీ ఎత్తున జనం తరలిస్తున్నారు పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో 3 కోట్ల 80 లక్షల మంది మూకుమ్మడిగా మార్పు కోరుకుంటున్నారని అది ఇవాళ్టి సభతో నాంది పలకబోతోందని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు మాణిక్ రావు ఠాక్రే.
అందరి భాగస్వామ్య ఆకాంక్షలకు తెర పడనుందని స్పష్టం చేశారు. జన గర్జన మహా ర్యాలీ నిదర్శనగా నిలవనుందని పేర్కొన్నారు . ఇదిలా ఉండగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర నేటితో ముగియనుంది. ముగింపు సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ సభను చేపట్టింది. భారీ ఎత్తున జనం తరలించేందుకు ప్లాన్ చేసింది టీపీసీసీ.
ఇప్పటి వరకు ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ యాత్ర ఖమ్మంతో ముగిసింది. మొత్తం 1360 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. పలువురు సీనియర్లు కాంగ్రెస్(Congress) పార్టీలో చేరి ప్రజా కూటమిని బలోపేతం చేయనున్నారని ఇది వాస్తవ రూపం దాల్చడం ఖాయమని స్పష్టం చేశారు మాణిక్ రావు ఠాక్రే.
తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి బ్లూ ప్రింట్ సిద్దమైందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా ప్రాంతపు అభివృద్ది , పురోగతికి తాము హామీ ఇస్తున్నామని తెలిపారు.
Also Read : Udhay Nidhi Stalin : మారి సెల్వరాజ్ కు ఉదయనిధి గిఫ్ట్