Congress Shock : జన గర్జన సభకు అడ్డంకులు
ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ఏర్పాటు
Congress Shock : కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో జరుప తలపెట్టిన జన గర్జన సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదివారం పెద్ద ఎత్తున సభను తలపెట్టింది. జనాన్ని తరలించేందుకు యత్నించారు. ఈ తరుణంలో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి పోలీసులపై నిప్పులు చెరిగారు. చెక్ పోస్టుల పేరుతో వాహనాలను అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇవాల్టి సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారు. కనీసం 5 లక్షల మందికి పైగా రానున్నారని అంచనా.
బాహుబలి పేరుతో స్టేజీని ఏర్పాటు చేశారు. ఏకంగా లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు చేయడం విశేషం. పోలీసులు అనేక ఆంక్షాలు విధించారంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కంటతడి పెట్టారు. ఇక ఖమ్మం అంతటా కాంగ్రెస్(Congress) కటౌట్లతో పూర్తిగా నిండి పోయింది.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ. ఇదే సమయంలో తమను అడ్డుకుంటారా అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రేణుకా చౌదరి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు సైతం పోలీసులపై మండిపడ్డారు. ఇవాల్టితో మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర ముగియనుంది. ఆయన 109 రోజులు పర్యటించారు. 1360 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేపట్టారు.
Also Read : Telangana Congress : తెలంగాణలో మార్పు ఖాయం – ఠాక్రే