Revanth Reddy : బీఆర్ఎస్ ఖతం పవర్ లోకి వస్తాం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో జరిగే శాసన సభ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను తమ పార్టీ 100 సీట్లు సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఖమ్మంలో తాము నిర్వహించిన జన గర్జన సభకు ఊహించని రీతిలో సక్సెస్ అయ్యిందని చెప్పారు రేవంత్ రెడ్డి.
3 లక్షల మందికి పైగా జనం స్వచ్చంధంగా హాజరయ్యారని అన్నారు. సభ విజయవంతం అయిన సందర్భంగా సోమవారం టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలోని పాలనకు జనం మంగళం పాడడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
సీఎం కేసీఆర్ , కల్వకుంట్ల ఫ్యామిలీ ఇక జైలుకు పోవడం పక్కా అన్నారు. అవినీతి, అక్రమాలపై విచారణ చేపడతామని ఆపై అందరినీ జైల్లోకి తోస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ కు సపోర్ట్ గా నిలిచిన అధికారులను కూడా వదిలి పెట్టబోమంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయమన్నారు. ప్రజలు కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఇప్పటికే తమ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న హామీలను పవర్ లోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. రూ. 4 వేలు పెన్షన్ అందజేస్తామన్నారు.
Also Read : Actor Dhanush : ధనుష్ న్యూ లుక్ అదుర్స్