Akhilesh Yadav : కేసీఆర్ తో అఖిలేష్ యాద‌వ్ భేటీ

మోదీ స‌ర్కార్ ను దించ‌డమే ల‌క్ష్యం

Akhilesh Yadav : దేశంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని దించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఎస్పీ చీఫ్ ,మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్. సోమ‌వారం ఆయ‌న స్వ‌యంగా హైద‌రాబాద్ కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు నేరుగా వెళ్లారు. అక్క‌డ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. చాలా సేపు చ‌ర్చించారు. ఇదిలా ఉండ‌గా 19 విప‌క్షాలు ఒకే వేదిక‌పైకి వ‌చ్చాయ‌ని ఈ త‌రుణంలో బీఆర్ఎస్ కూడా క‌లిసి రావాల‌ని కోరారు. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశంలోనే అవినీతికి కేరాఫ్ సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ నేత‌లు సైతం స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు రాహుల్ గాంధీకి. ఆయ‌న ఏ హోదాతో త‌మ నేత‌ను టార్గెట్ చేశారంటూ ధ్వ‌జమెత్తారు. ఇదిలా ఉండ‌గా కేసీఆర్ తో ఏం మాట్లాడార‌నే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు అటు బీఆర్ఎస్ నుంచి ఇటు ఎస్పీ చీఫ్ నుంచి. మొత్తంగా అన్ని పార్టీల ఉమ్మ‌డి ల‌క్ష్యం ఒక్క‌టే బీజేపీని నామ రూపాలు లేకుండా చేయ‌డం. ఆ పార్టీని 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడించ‌డం అని స్ప‌ష్టం చేశారు అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav).

ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీల ల‌క్ష్యం ఒక్క‌టే అయిన‌ప్పుడు అన్ని పార్టీలు క‌లిసి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కాంగ్రెస్ కూడా త‌మ ఉమ్మ‌డి వేదిక‌లో ఒక భాగమేన‌ని పేర్కొన్నారు. కేసీఆర్ ను క‌లిసిన త‌ర్వాత ఆయ‌న సానుకూలంగా ఉన్నార‌ని చెప్పారు.

Also Read : BJP Focus : ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లపై బీజేపీ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!