PM Modi : మహనీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ
ఆయన జీవితం స్పూర్తి దాయకం
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీని గుర్తు చేశారు. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్బంగా ముఖర్జీ జీవితం ఆదర్శ ప్రాయమని, ఆయన దేశానికి చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. తన జీవిత కాలమంతా సమాజం కోసం, దేశం కోసం కృషి చేశారని పేర్కొన్నారు.
బలమైన భారత దేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు ప్రధానమంత్రి(PM Modi). గొప్ప జాతీయ వాద ఆలోచనా పరుడు. అంతకు మించిన విద్యా వేత్త, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు అని తెలిపారు మోదీ. ఆయనకు వేల వందనాలు ఈ సందర్భంగా తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ నిర్దేశించిన సూత్రాలు దేశంలోని ప్రతి తరానికి స్పూర్తి కలిగిస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు ప్రధాని.
ఇదిలా ఉండగా ముఖర్జీ జూలై 6, 1901లో పుట్టారు. జాతీయ వాద నేతలలో ఒకడిగా గుర్తింపు పొందారు. 1951లో భారతీయ జన సంఘ్ ను స్థాపించారు. ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయ వాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. కలకత్తా యూనివర్శిటీ వీసీగా పని చేశారు.
కోల్ కతాలో చదువుకున్నారు. నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నారు.
Also Read : Salaar Teaser : సలార్ టీజర్ సెన్సేషన్