Dinesh Arora : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరోరా అరెస్ట్
మనీ లాండరింగ్ కేసులో అప్రూవర్
Dinesh Arora : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోలుకోలేని షాక్ ఇచ్చింది .ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇది 13వ అరెస్ట్ కావడం విశేషం. రోజుకో ట్విస్ట్ ఇస్తూ మరింత ఆసక్తిని రేపుతోంది ఈడీ. మరో వైపు ఆప్ మాత్రం కావాలని తమ నేతలను ఇరికించేందుకు కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే ఆప్ అగ్ర నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. జైలుకు తరలించింది. ఆయన కూడా సుప్రీంకోర్టులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారించిందిన ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఉన్నట్టుండి దినేష్ అరోరా(Dinesh Arora)ను అరెస్ట్ చేయడంతో ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా వారిలో వణుకు మొదలైంది. సుదీర్ఘ విచారణ తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లోని క్రిమినల్ సెక్షన్ల కింద అరోరాను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు