MP Ravindranath Kumar : ఓపీఎస్ తనయుడికి బిగ్ షాక్
ఎంపీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు
MP Ravindranath Kumar : తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తనయుడు రవీంద్రనాథ్ కుమార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. దీనిపై విచారించిన కోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఓటర్లను ప్రభావితం చేశారని, డబ్బులు పంపిణీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయితే దీనిని సవాల్ చేసేందుకు ఒక నెల గడువు ఇచ్చింది కోర్టు.
ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ కుమార్(MP Ravindranath Kumar) ఎన్నిక ఇక చెల్లదంటూ పేర్కొనడంతో ఆ పార్టీలో కుదుపునకు లోనయ్యేలా చేసింది. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఎడాపోడి పళని స్వామి ఇకపై తమ ఎంపీ కాదంటూ ప్రకటించారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఓపీఎస్ స్వయంగా వెల్లడించడం విశేషం.
కాగా గతంలో జరిగిన ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని తేని లోక్ సభ నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే పార్టీ తరపున పోటీ చేసిన రవీంద్రనాథ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ పై 76 వేల 693 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా డబ్బులు పంపిణీ చేశాడంటూ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు ఎంపీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది.
Also Read : Salaar Teaser Record : ప్రభాస్ సలార్ టీజర్ రికార్డ్