PM Modi Slams : కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలపై ఫోకస్
దర్యాప్తు సంస్థలు జల్లెడ పడతాయి
PM Modi Slams : తెలంగాణ ప్రజలు ఒకే కుటుంబం కబంంధ హస్తాల్లో కూరుకు పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఓరుగల్లులో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించారు ప్రధాని. ఈ సందర్బంగా కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఏకి పారేశారు. అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు మోదీ.
ఇదే సమయంలో అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబం పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ, సీబీఐ దృష్టి పెట్టాయని , త్వరలోనే వారి ఆస్తుల, అవినీతి చిట్టా బయట పడుతుందన్నారు నరేంద్ర మోదీ(PM Modi).
స్కామ్ లు, కమీషన్లకు అలవాటు పడిన ఈ కుటుంబం మొత్తం తనను తిట్టి పోసేందుకే సమయం వెచ్చిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలు ఈ అరాచక పాలనను సహించరని , రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ధ్వజమెత్తారు.
కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు ప్రధానమంత్రి. యూనివర్శిటీల్లో 3,000 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇక సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న వేలాది టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేక పోయిందని ప్రశ్నించారు మోదీ.
Also Read : PM Modi : కేసీఆర్ కుటుంబం అవినీతిమయం
