PM Modi KCR : తెలంగాణలోనే కాదు యావత్ దేశమంతటా సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధించి అవినీతి పాతుకు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఓరుగల్లులో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప్ సభలో ప్రసంగించారు. దేశ అభివృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆపై కేసీఆర్ ను టార్గెట్ చేయడం కలకలం రేపింది.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి పేరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ(PM Modi). దొర పాలన సాగుతోందని, ఈ పాలనను చూసి ప్రజలు తట్టుకోలేక పోతున్నారంటూ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానన్నాడు, కుటుంబాలకు 3 ఎకరాల పొలం ఇస్తానని నమ్మించాడు సీఎంగా కొలువు తీరాడు. ఆపై జనాన్ని దండుకోవడంలో నెంబర్ వన్ గా మారాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణను ఊడ్చి పారేశాడని, ఇప్పుడు విలువైన భూములను కొల్లగొట్టే పనిలో ఉన్నాడని ఫైర్ అయ్యారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అప్పనంగా తన వారికి అప్పగిస్తున్నాడని బీజేపీ ప్రభుత్వం వచ్చాక విచారణ చేపట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు మోదీ.
ఇప్పటికే కేసీఆర్ పైన, ఆయనకు చెందిన కుటుంబీకులైన కొడుకు కేటీఆర్, తనయ ఎమ్మెల్సీ కవిత, అల్లుడు హరీశ్ రావు, మరో ఎంపీ సంతోష్ రావుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయని ప్రకటించారు ప్రధానమంత్రి.
Also Read : PM Modi Slams : కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలపై ఫోకస్
