YS Vijayamma : వైఎస్సార్ కు మ‌ర‌ణం లేదు – విజ‌య‌మ్మ‌

జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేశారు

YS Vijayamma : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చైర్మ‌న్ వైఎస్ విజ‌య‌మ్మ‌, పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల శ‌నివారం క‌డ‌ప జిల్లా ఇడుపుల పాయ‌కు చేరుకున్నారు. దివంగ‌త సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున పార్టీకి చెందిన నాయ‌కులు, శ్రేణులు అక్క‌డికి చేరుకున్నారు. భార్య విజ‌యమ్మ‌, కూతురు ష‌ర్మిల తండ్రి స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు.

త‌న జీవిత‌మంతా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన అరుదైన నాయ‌కుడు డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని స్ప‌ష్టం చేశారు భార్య విజ‌య‌మ్మ‌(YS Vijayamma). ఎక్క‌డ ఉన్నా పేద‌లు బాగు ప‌డాల‌ని కోరుకున్నాడ‌ని, వారి కోసం చేస్తున్న ప్ర‌య‌త్నంలోనే తాను మ‌ట్టిలో క‌లిసి పోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ బ‌తికి ఉంటే పేద‌లు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రిగి ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త వైఎస్సార్ దేన‌ని పేర్కొన్నారు కూతురు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర దేశంలోనే చ‌రిత్ర సృష్టించింద‌ని అన్నారు. ఆ యాత్ర కాంగ్రెస్ పార్టీని ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రంలో కొలువు తీరేలా చేసింద‌న్నారు ష‌ర్మిల‌. ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక పోయినా ఈ లోకంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం బ‌తికే ఉంటార‌ని అన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్‌.

Also Read : PM Modi KCR : దేశ‌మంతా పాకిన కేసీఆర్ అవినీతి

 

Leave A Reply

Your Email Id will not be published!