US Chemical Weapons : ర‌సాయ‌న ఆయుధ నిల్వ‌లు ధ్వంసం

ప్ర‌క‌టించిన అమెరికా దేశ అధ్య‌క్షుడు

US Chemical Weapons : అమెరికా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ అధ్య‌క్షుడు జో బైడెన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైట్ హౌస్ వేదిక‌గా యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా త‌మ ఆధీనంలో ఉన్న ర‌సాయ‌న ఆయుధ నిల్వ‌ల‌ను నాశ‌నం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 1997 కెమిక‌ల్ వెప‌న్స్ క‌న్వెన్ష‌న్ ప్ర‌కారం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. అమెరికా(US) త‌న చివ‌రి ఆయుధాల నిల్వ‌ల‌ను విజ‌యంతంగా ధ్వంసం చేసింద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే అంశానికి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం పంచుకున్నారు ప్రెసిడెంట్. 2022లో కెంట‌కీ లోని ప్లాంట్ లో వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ తో కూడిన చివ‌రి ఎం55 రాకెట్ ను కూడా పూర్తిగా నాశ‌నం చేసిన‌ట్లు చెప్పారు బైడెన్.

త‌మ ఆధీనంలో ఉన్న ఆయుధాల నిల్వ‌ల‌ను ధ్వంసం చేసేందుకు క‌నీసం 30 ఏళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింద‌ని స్ప‌ష్టం చేశారు . ర‌సాయ‌న ఆయుధాలు క‌లిగి ఉండ‌డం ఈ ప్ర‌పంచానికి ప్ర‌మాదం. దీనిని మేం ముందే గుర్తించాం. ఇవాళ యావ‌త్ ప్ర‌పంచం శాంతిని కోరుకుంటోంద‌న్నారు.

ఆయుధాల నుండి విముక్తి కోరుకునే దిశ‌గా అమెరికా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, అందు వ‌ల్ల‌నే ద‌శ‌ల వారీగా ఆయుధ నిల్వ‌ల‌ను నాశ‌నం చేస్తూ వ‌చ్చింద‌ని పేర్కొన్నారు ప్రెసిడెంట్ బైడెన్.

Also Read : YS Sharmila Tribute : మ‌హానేత‌కు మ‌ర‌ణం లేదు – ష‌ర్మిల‌

 

Leave A Reply

Your Email Id will not be published!