TTD JEO : టీటీడీ పోర్ట‌ల్ లో ఆల‌యాల స‌మాచారం

ఆదేశించిన జేఈవో వీర బ్ర‌హ్మం

TTD JEO : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) జేఈవో వీర‌బ్ర‌హ్మం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు టీటీడీకి సంబంధించిన వెబ్ సైట్ (పోర్ట‌ల్ ) లో ఆల‌యాల‌తో పాటు అనుబంధ గుడుల కు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారాన్ని పొందు ప‌ర్చాల‌ని ఆదేశించారు. శ‌నివారం జేఈవో ఆల‌యాల డిప్యూటీ ఈవోలు, ఇత‌ర అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ గా స‌మావేశం ఏర్పాటు చేశారు. నిత్యం భ‌క్తులు ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని, కానీ స‌మ‌గ్ర స‌మ‌చారం మాత్రం ఉండ‌డం లేద‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌న్నారు. భ‌క్తుల‌కు పూర్తి స‌మాచారం అందుబాటులో ఉన్న‌ట్ల‌యితే సుల‌భంగా ద‌ర్శించుకునేందుకు వీలు క‌లుగుతంద‌ని తెలిపారు జేఈవో(TTD JEO) వీర బ్ర‌హ్మం.

ఆల‌యాల‌కు సంబంధించిన స్థ‌ల పురాణం, దాని చరిత్ర‌, విశిష్ట‌త‌, ర‌వాణా స‌దుపాయాల స‌మాచారం కూడా పొందు ప‌ర్చాల‌ని సూచించారు. ఆల‌యాల విశిష్ట‌త‌కు సంబంధించి తెలుగులోనే కాకుండా వివిధ భాష‌ల‌లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంద‌న్నారు వీర బ్ర‌హ్మం. ఐటీ, పీఆర్ఓ విభాగాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు.

ఆయా ఆల‌యాల‌కు సంబంధించిన స‌మాచారం, సేవ‌లు, ద‌ర్శ‌న వేళ‌లు, వ‌స‌తి స‌దుపాయాల గురించి పూర్తి స‌మాచారం ఉండాల‌ని ఆదేశించారు. ఎస్వీబీసీతో స‌మ‌న్వ‌యం చేసుకుని ఆల‌యాల‌కు సంబంధించిన ప్రోమోలు విడుద‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు జేఈవో.

Also Read : Rinku Singh Drop : రింకూ సింగ్ లేక పోతే ఎలా

 

Leave A Reply

Your Email Id will not be published!