Raghav Chadha : కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది

ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా వెల్ల‌డి

Raghav Chadha : కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒకే వేదిక‌పైకి రావాలని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ సార‌థ్యంలో కీల‌క భేటీ జ‌రిగింది. మొద‌ట హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని సిమ్లాలో మ‌రోసారి స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించారు.

కానీ ఈ కీల‌క స‌మావేశాన్ని తిరిగి జూలై 17,18న రెండు రోజుల పాటు క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ .

ఈ సంద‌ర్భంగా కేంద్రం తీసుకు వ‌చ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్య‌తిరేకంగా తీసుకు వ‌చ్చిన బిల్లుకు సంబంధించి వ్య‌తిరేకంగా ఆప్ ప్ర‌వేశ పెట్టిన తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మొద‌టి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. దీనిపై క్లారిటీ ఇవ్వ‌క పోతే తాము చేర‌బోమంటూ ప్ర‌క‌టించారు.

దీనిపై శ‌నివారం ఆ పార్టీకి చెందిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha) మీడియాతో మాట్లాడారు. బెంగ‌ళూరులో జ‌రిగే విప‌క్షాల స‌మావేశానికి కాంగ్రెస్ నుంచి ఆప్ కి పాల్గొనాల‌ని ఆహ్వానం అందింద‌ని చెప్పారు.

Also Read : KTR Modi : మోదీ బెదిరింపుల‌కు భ‌య‌పడం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!