Dasoju Sravan : మోదీ క‌ళ్లు మూసుకున్న క‌బోధి

దాసోజు శ్ర‌వ‌ణ్ షాకింగ్ కామెంట్స్

Dasoju Sravan : ఓరుగ‌ల్లు వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీఆర్ఎస్ అగ్ర నేత దాసోజు శ్ర‌వ‌ణ్. ప్ర‌ధాని క‌ళ్లు మూసుకున్న క‌బోధి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన అభివృద్ది క‌నిపించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు . క‌ర్ణాట‌క‌లో 40 శాతం బ‌హిరంగంగా అవినీతికి పాల్ప‌డ‌డం వ‌ల్ల‌నే అక్క‌డ బీజేపీని ప‌క్క‌న పెట్టార‌ని ఆ విష‌యం మోదీకి తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.

త‌న గుజ‌రాత్ కు రూ. 20 వేల కోట్ల‌తో లోకోమోటివ్ ఫ్యాక్ట‌రీ త‌ర‌లించుకు పోయాడ‌ని , కానీ రూ. 521 కోట్ల‌తో కేవ‌లం రైల్వే వ్యాగ‌న్ యూనిట్ ను ఏర్పాటు చేయ‌డం దారుణ‌మ‌న్నారు దాసోజు శ్ర‌వ‌ణ్‌(Dasoju Sravan). మోదీ ప్ర‌సంగం పూర్తిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ మోదీ వ‌ల్ల రాలేద‌ని సంబండ వ‌ర్ణాలు పోరాడితే వ‌చ్చింద‌న్నారు.

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు అప్ప‌నంగా వ్యాపార‌వేత్త‌ల‌కు అప్ప‌గించిన చ‌రిత్ర ప్ర‌ధానిది కాదా అని ప్ర‌శ్నించారు. ఇవాళ ఆర్థిక నేర‌గాళ్లు మోదీ పాల‌న‌లోనే ఎక్కువ‌య్యారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇవాళ రాష్ట్రంలో ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతోంద‌ని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటుగా మారింద‌ని మోదీపై మండిప‌డ్డారు దాసోజు శ్ర‌వ‌ణ్. బీజేపీని ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.

Also Read : Ajit Agarkar : సీనియ‌ర్ల‌కు మూడిన‌ట్లేనా

 

Leave A Reply

Your Email Id will not be published!