TTD Cancels Break Darshan : 11న శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
TTD Cancels Break Darshan : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). దర్శనంలో భాగంగా వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ఇచ్చే సిఫార్సు లేఖలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీటీడీ ఆదివారం భక్తులకు సంబంధించి బ్రేక్ దర్శనం ఉండదని పేర్కొంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల అణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 11న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. దీని కారణంగా 11న స్వామి వారి దర్శనానికి సంబంధించి టీటీడీ జారీ చేసే అన్ని బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. దీంతో జూలై 10న సోమవారం ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించే ప్రసక్తి లేదని భక్తులకు తేల్చి చెప్పింది.
11న శ్రీవారి దర్శనానికి సంబంధించి సిఫారసు లేఖలు తీసుకున్న భక్తులు ముందు జాగ్రత్తగా రద్దు చేసుకోవడమో లేదా ఆ తేదీని మార్చు కోవడమో చేసుకోవాలని భక్తులకు సూచించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదిలా ఉండగా వేసవి సెలవులు ముగిసినా ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. ఏ మాత్రం రద్దీ తగ్గడం లేదు. టీటీడీ ఏర్పాట్లు చేసేందుకు నానా తంటాలు పడుతోంది. మరో వైపు స్వామి వారికి ఆదాయం హుండీ రూపేణా పెరగడం విశేషం.
Also Read : Modi KCR Family Comment : ఆరోపణలు సరే అరెస్ట్ ఎప్పుడు..?
