Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తజనం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ తగ్గడం లేదు. రోజు రోజుకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. శనివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న ఒక్క రోజే పెరగడం గమనార్హం. మొత్తం 86 వేల 781 మంది భక్తులు శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ఇదే సమయంలో శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
44 వేల 920 మంది సమర్పించుకున్నారు స్వామి వారికి. ఇక భక్తులు నిత్యం స్వామి వారికి మొక్కుల సందర్భంగా చెల్లించుకునే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం కూడా భారీగా పెరగడం విశేషం. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇక స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. తిరుమల లోని సిలా తోరణం వరకు నిలిచి ఉన్నారు.
ఇక ఎలాంటి సర్వ దర్శనం టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా దర్శన భాగ్యం కలగనుందని టీటీడీ అంచనా వేసింది. ఇదిలా ఉండగా పోటెత్తిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిల ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఈవో స్పష్టం చేశారు.
Also Read : Hanumantha Vahanam : సుందర రాజ స్వామి ఉత్సవాలు