Ponguleti Srinivas Reddy : పువ్వాడ ఓ బ‌చ్చా – పొంగులేటి

ఖ‌మ్మం జిల్లాలో వేడెక్కిన పాలిటిక్స్

Ponguleti Srinivas Reddy : ఖ‌మ్మం జిల్లాలో పాలిటిక్స్ వేడెక్కాయి. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. అధికార భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్న‌ట్టుండి డోస్ పెంచారు. ఇటీవ‌లే ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఖ‌మ్మం వేదిక‌గా జ‌రిగిన జ‌న గ‌ర్జ‌న స‌భ‌లో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఆపై ఇదే జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

నా ముందు పువ్వాడ ఓ బ‌చ్చా అంటూ నిప్పులు చెరిగారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). ఆయ‌న‌పై నేను పోటీ చేయాల్సిన అవ‌స‌రం లేదు. నా అనుచ‌రుల‌లో ఎవ‌రో ఒక‌రు బ‌రిలోకి దిగుతారంటూ కామెంట్ చేశారు. నేను పోటీ చేయ‌ను..కానీ ఓ బ‌చ్చాను పువ్వాడ అజ‌య్ కుమార్ కు వ్య‌తిరేకంగా నిల‌బెడ‌తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

మంత్రి పువ్వాడ‌తో పాటు ఖ‌మ్మం జిల్లా నుండి ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించన‌ని ఛాలెంజ్ చేశారు. ఎవ్వ‌రినీ తెలంగాణ అసెంబ్లీని తాకనివ్వ‌నంటూ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్. తాజాగా మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు జిల్లాలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. మొత్తంగా రాబోయే ఎన్నిక‌లు హాట్ టాపిక్ గా మారాయి.

Also Read : Janasena Master Plan : జ‌న‌సేన మాస్ట‌ర్ ప్లాన్ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!