MP Aravind KCR : కేసీఆర్ దేశం విడిచి పోవచ్చు
ఎంపీ ధర్మపురి అరవింద్
MP Aravind KCR : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆరు నూరైనా సరే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ ) బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని స్పష్టం చేశారు. ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కొందరు ముస్లిం మత పెద్దలను తీసుకు వెళ్లారని, సీఎం కేసీఆర్ తో చర్చించారని ఆరోపించారు.
ఎంఐఎం ఒత్తిళ్ల మేరకే సీఎం కేసీఆర్ ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారని మండిపడ్డారు. ఒకవేళ ఆయన యూసీసీ వద్దని అనుకుంటే భారత్ లో కాకుండా పాకిస్తాన్ కు వెళ్ల వచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్(MP Aravind). రాబోయే ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ నిలబడినా లేదా ఆయన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలబడినా తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఎవరు నిలబడినా ఓడి పోవడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు ధర్మపురి అరవింద్. ప్రజలు కేసీఆర్ ను, ఆయన పాలనను నమ్మడం లేదన్నారు. రాబోయేది బీజేపీనేనని జోష్యం చెప్పారు ఎంపీ.
Also Read : CM KCR Announces : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం