CM KCR : వీఆర్ఏల‌కు కేసీఆర్ ఖుష్ క‌బ‌ర్

వివిధ శాఖ‌ల్లో స‌ర్దుబాటు చేయండి

CM KCR : సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ప‌ని చేస్తున్న వీఆర్ఏ (విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్ ) ల‌కు తీపి క‌బురు చెప్పారు. ఈ మేర‌కు వారి వారి విద్యార్హ‌త‌ల‌ను, సామ‌ర్థ్యాల‌ను అనుస‌రించి నీటి పారుద‌ల శాఖ‌తో స‌హా ఇత‌ర శాఖ‌ల్లో స‌ర్దుబాటు చేయాల‌ని ఆదేశించారు. వారి సేవ‌ల‌ను విస్తృతంగా వినియోగించు కోవాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఈ నేప‌థ్యంలో వీఆర్ఏల‌తో స‌మావేశమై , వారితో సుదీర్ఘంగా చ‌ర్చించి వారి అభిప్రాయాల‌ను సేక‌రించి అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు కేసీఆర్(CM KCR). ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో మంత్రులు విద్యా శాఖా మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్ ల‌తో కూడిన మంత్రివ‌ర్గ ఉప సంఘాన్ని సీఎం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్.

సీఎం ఆదేశాల మేర‌కు మంత్రివ‌ర్గ ఉప సంఘం వీఆర్ఏల‌తో జూలై 12 నుంచి చ‌ర్చ‌లు ప్రారంభించ‌నుంది. చ‌ర్చ‌ల అనంత‌రం ఉప సంఘం సూచ‌న‌లు, స‌ల‌హాల ప్ర‌కారం నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఈ మేర‌కు వీఆర్ఏల సేవ‌ల‌ను వినియోగించుకునే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతుంది ప్ర‌భుత్వం.

ఇందుకు సంబంధించి ఉప సంఘం క‌స‌ర‌త్తు పూర్త‌య్యాక తుది నివేదిక సిద్ద‌మైన త‌ర్వాత మ‌రోసారి చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటాని సీఎం స్ప‌ష్టం చేశారు. సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.

Also Read : KCR Bandi Sanjay : బండికి కేసీఆర్ బ‌ర్త్ డే గ్రీటింగ్స్

 

Leave A Reply

Your Email Id will not be published!