Revanth Reddy : కౌలు రైతులకు రేవంత్ భరోసా
తానా సభలో టీపీసీసీ చీఫ్ ప్రకటన
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కౌలు రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అమెరికా టూర్ లో ఉన్న రేవంత్ రెడ్డి తానా సభలో ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నిన్న అవసరమైతే సీతక్కను సీఎం చేస్తానన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇవాళ మరో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఇప్పటికే ప్రకటించామన్నారు. ఇందులో పట్టాదారు కలిగిన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వాటిని యథావిధిగా కౌలు రైతులకు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
రైతు బంధు పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ను ఏ ఒక్కరు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది త్వరలోనే తేలుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బాజాప్తాగా పవర్ లోకి వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
ఇప్పటికే ఖమ్మం సభలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రూ. 4 వేలు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. తాను అనని మాటల్ని వక్రీకరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎంతగా దుష్ప్రచారం చేసినా ఎవరూ నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్.
Also Read : Shashi Tharoor : శశి థరూర్ కీలక కామెంట్స్