CM YS Jagan : పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే జాబ్స్
ఆదేశించిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
CM YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, కంపెనీలలో 75 శాతం స్థానికులకే ఇవ్వాలని ఆదేశించారు. దీనిని ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నైపుణ్యం కలిగిన వారు లేక పోయినా వారిని ఎంపిక చేసుకున్ని తగిన రీతిలో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. దశల వారీగా ఇయర్ క్యాలెండర్ ను కూడా ప్రకటించినట్లు తెలిపారు.
క్యాంపు ఆఫీసులో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం జగన్ రెడ్డి(CM YS Jagan). ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలు, సంస్థలతో పాటు ఏర్పాటు చేసే వాటిలో కూడా ముందు స్థానికులైన నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆ తర్వాత మిగతా వారికి కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అన్ని రంగాలలో తర్ఫీదు పొందాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ నడుస్తున్నాయని వెల్లడించారు ఏపీ సీఎం. ఇందుకు సంబంధించి చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం. మొత్తం మీద ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికులు, నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Revanth Reddy : కౌలు రైతులకు రేవంత్ భరోసా