Sonia Gandhi Welcome : విందుకు వెల్ కమ్ – సోనియా
విపక్షాల భేటీకి ప్రాధాన్యత
Sonia Gandhi Welcome : కేంద్రంలో కొలువుతీరిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒకే వేదికపైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే గత నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీనికి కీలక పాత్ర పోషించారు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ . 17 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. తమ అభిప్రాయాలు వెల్లడించారు.
అయితే ఢిల్లీ ఆర్డినెన్స్ అడ్డుకోవడం విషయంలో కాంగ్రెస్(Congress) తన వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ఇదే వేదికగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు సర్ది చెప్పడంతో సమిసి పోయింది.
ఈ కీలక భేటీ విజయవంతం కావడంతో దానికి పేరు కూడా పెట్టారు. అదేమిటంటే పేట్రియాట్రిక్ డెమోక్రటిక్ ఫోరమ్ (పీడీఎఫ్) అని. ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించారు నితీశ్ కుమార్. ఇదిలా ఉండగా రెండో కీలక సమావేశం మొదట హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో చేపట్టాలని అనుకున్నారు.
కానీ అక్కడ భారీ ఎత్తున వరదలు విలయ తాండవం చేస్తున్నాయి. దీంతో కీలక సమావేశాన్ని జూలై 17,18న బెంగళూరులో జరపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ 24 పార్టీలకు ఆహ్వానం పలికింది. విందుకు రావాలని కోరింది.
Also Read : Pawan Kalyan YS Jagan : దోచుకోవడం జగన్ నైజం