Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు
Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలు కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గత కొన్ని రోజుల నుంచి ఈ తాకిడి మరింత పెరిగింది. ఒకటి రెండు రోజులు తగ్గినా రెండు నెలల నుంచి భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు.
నిన్న ఒక్క రోజు స్వామి వారిని 72 వేల 664 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 32 వేల 336 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. భక్తులు స్వామి, అమ్మ వార్లకు సమర్పించుకున్న కానుకలు, విరాళాలు ర. 3 కోట్ల 41 లక్షల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
తిరుమల లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 20 గంటలకు పైగా పడుతుందని అంచనా వేసింది టీటీడీ. సాధ్యమైనంత మేరకు దర్శనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి. మరో వైపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సాధ్యమైనంత మేరకు దర్శనాన్ని అందించేలా చూడాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించారు.
ఏ ఒక్కరూ బాధ పడినా దేవస్థానానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని చోట్లా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also Read : Nitin Gadkari visits : తిరుమలలో నితిన్ గడ్కరీ