Penipe Viswarup : ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక పెన్షన్
ఏపీ రాష్ట్ర మంత్రి పెనిపె విశ్వరూప్
Penipe Viswarup : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి పెనిపె విశ్వ రూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని రీతిలో తమ ప్రభుత్వం అత్యధిక పెన్షన్ సౌకర్యం కల్పిస్తోందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 15,000 నుంచి రూ. 40,000 దాకా చెల్లిస్తున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి వల్లనే ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులకు మేలు జరిగిందని కొనియాడారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు మంత్రి పెనిపె విశ్వరూప్.
ఏపీ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 50 వేల మంది పని చేస్తున్నారని వారందరికీ గౌరవ ప్రదంగా ఉండేలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు మంత్రి. ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వేతనాలు సకాలంలో చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు పెనిపె విశ్వరూప్(Penipe Viswarup).
రూ. 2,500 కోట్లకు పైగా తీసుకున్న రుణాలను తీర్చడం జరిగిందన్నారు. కొత్తగా 1500 డీజిల్, 1000 విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు మంత్రి. సంస్థలో ఎప్పటికప్పుడు డ్రైవర్లను నియమిస్తున్నామని, దాదాపు 1000 మందికి కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని చెప్పారు.
Also Read : kaluva Srinivasulu : వైసీపీ నేతలకు పంటల బీమా