V Srinivas Goud : బొత్స దమ్ముంటే దా – శ్రీనివాస్ గౌడ్
తెలంగాణను చూసి ఓర్వలేని మాటలు
V Srinivas Goud : ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తెలంగాణలో విద్యా రంగం గాడి తప్పిందని, కనీసం టీచర్లను బదిలీ చేసే స్థాయిలో అక్కడి సర్కార్ లేదంటూ అనుచిత కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.
బొత్స చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud). గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పరీక్షలు చూసి రాశారు కాబట్టే అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న అభివృద్దిని చూసి ఓర్వ లేక చవకబారు విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి.
ఏపీ మంత్రులు ముందు మీ మూతులు కడుక్కోవాలంటూ హితవు పలికారు. పోటీ పరీక్షల్లో ఏపీ రాజధాని ఏంటని అడిగితే సమాధానం రాయలేని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ విద్యార్థులతో మీ ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొచ్చి పోటీ పెడితే టాలెంట్ ఏమిటో తెలుస్తుందన్నారు.
ఉమ్మడి ఏపీలో జరిగిన పరీక్షల్లో స్కామ్స్ కు పాల్పడిన చరిత్ర మీదంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇంజనీరింగ్ కాలేజీలకు తాళాలు వేసిన చరిత్ర తమదన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడి పోయేందుకు కారణం బొత్స లాంటి వాళ్లేనని ఆరోపించారు. దమ్ముంటే చర్చకు రావాలని వి. శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు.
Also Read : BS RAO Chairman : శ్రీ చైతన్య సంస్థల చైర్మన్ కన్నుమూత