CM YS Jagan : విద్యా రంగంలో టెక్నాలజీ ముఖ్యం

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్

CM YS Jagan : విద్యా రంగంలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విద్యా శాఖ‌పై కీల‌క స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ కీల‌క మీటింగ్ కు ముఖ్య అతిథిగా సీఎం హాజ‌రై ప్ర‌సంగించారు. రోజు రోజుకు టెక్నాల‌జీ పెరుగుతోంద‌ని, యావ‌త్ ప్ర‌పంచం దానితో అనుసంధానం అవుతున్న స‌మ‌యంలో మ‌నం కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ప్ర‌ధానంగా విదేశాల‌లో ఉన్న విద్యా వ్య‌వ‌స్థ‌ను, అక్క‌డి కోర్సుల‌ను, విద్యా వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిశీలించాల‌ని అందుకు అనుగుణంగా క‌రిక్యుల‌ర్ ను త‌యారు చేయాల‌ని సూచించారు ఏపీ సీఎం(CM YS Jagan). విద్యా రంగానికి చెందిన మేధావులు, ప్రొఫెస‌ర్లు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని కోరారు .

పాఠ‌శాల‌, ఉన్న‌త విద్య‌లో కీల‌క మార్పులు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీ, వ‌ర్చువ‌ల్ రియాల్టీ, అగ్మెంటేష‌న్ రియాల్టీల‌ను బోధ‌న‌కు అనుసంధానం చేయాల‌ని అన్నారు. ఆర‌వ త‌ర‌గ‌తి నుంచే టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేయాల‌ని సూచించారు జ‌గ‌న్ రెడ్డి. దీని వ‌ల్ల ప్ర‌పంచ విద్యార్థుల‌తో పోటీ ప‌డేలా చేయాల‌ని కోరారు .

Also Read : V Srinivas Goud : బొత్స ద‌మ్ముంటే దా – శ్రీ‌నివాస్ గౌడ్

 

Leave A Reply

Your Email Id will not be published!