Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.83 కోట్లు
దర్శించుకున్న భక్తులు 67, 300
Tirumala Hundi : రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రానికి. భక్తులు పెరుగుతున్నారే తప్పా తగ్గడం లేదు. వేసవి సెలవులు ముగిసినా భక్తులు తరలి వస్తున్నారు. నిన్న శ్రీవారిని 67 వేల 300 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఇదిలా ఉండగా ఎప్పటి లాగే స్వామి వారికి తలనీలాలు సమర్పించుకునే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగతోంది. 32 వేల 802 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొంది టీటీడీ.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు గాను తిరుమలలోని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి పోయాయి. చివరకు సిలా తోరణం వద్ద వరకు నిలిచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా కేవలం స్వామి వారికి సంబంధించిన సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారికి కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తెలిపింది.
ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా సకల ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా చంటి పిల్లల తల్లులు, వృద్దులకు త్వరగా దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read : Dasoju Sravan : రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి