PM Modi : ఫ్రాన్స్ తో భారత్ చిరకాల స్నేహం – మోదీ
మోక్రాన్ ఆతిథ్యం అద్భుతమన్న ప్రధాని
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పీఎం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఫ్రాన్స్ దేశం తరపున అద్భుతమైన సాదర స్వాగతం లభించింది. దేశ రాజధాని పారిస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఫ్రాన్స్ , భారత్ దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు.
ఇది ఇలాగే మున్ముందు కూడా సాగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ యావత్ ప్రపంచం ఒక ఉమ్మడి కేంద్రంగా మారుతోందన్నారు. ఈ తరుణంలో ప్రపంచం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని వాటిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
ఎయిర్ పోర్టులో ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు మోదీ(PM Modi). ప్రత్యేకించి ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, ఈ అరుదైన కార్యక్రమానికి తనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినందుకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పారు.
విశిష్టమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని ప్రకటించారు. ఇరు దేశాలు పురావస్తు మిషన్లపై పని చేస్తున్నాయని చెప్పారు. డిజిటల్ రంగంలో తమ దేశం ముందంజలో ఉందని చెప్పారు ప్రధాని.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.83 కోట్లు