ISRO Chairman : చంద్ర‌యాన్-3 స‌క్సెస్ – ఇస్రో చీఫ్

శాస్త్ర‌వేత్త‌లు, టీంకు అభినంద‌న‌లు

ISRO Chairman : భార‌త దేశం తో పాటు యావ‌త్ ప్ర‌పంచం ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న చంద్ర‌యాన్ -3 శ్రీ‌హ‌రి కోట నుంచి నింగిలోకి దూసుకు వెళ్లింది. ఈ సంద‌ర్భంగా ఇస్రో చైర్మ‌న్ సోమ్ నాథ్ సంతోషం వ్య‌క్తం చేశారు. బాహుబ‌లి రాకెట్ ను త‌యారు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌తి ఒక్క‌రికీ, శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. చంద్ర‌యాన్ -3 చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లేందుకు 40 రోజుల పాటు ఉంటుంది అంత‌రిక్షంలో. అక్క‌డి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోలు , అప్ డేట్స్ పంపిస్తుంది చంద్ర‌యాన్ -3 .

ఇదిలా ఉండ‌గా చంద్ర‌యాన్ -3 ఏపీలోని శ్రీ‌హ‌రి కోట నుండి శుక్ర‌వారం స‌రిగ్గా 2.53 నిమిషాల‌కు నింగిలోకి దూసుకు వెళ్లింది. ఈ మిష‌న్ గ‌నుక స‌క్సెస్ అయితే ర‌ష్యా, చైనా, అమెరికా త‌ర్వాత భార‌త్ చంద్రుని వ‌ద్ద‌కు వెళ్లిన నాలుగో దేశంగా చ‌రిత్ర సృష్టిస్తుంది. చంద్ర‌యాన్ -3కి మ‌రో పేరు కూడా పెట్టారు బాహుబ‌లి రాకెట్ అని. ఆగ‌స్టు 23న ల్యాండింగ్ అవుతుంద‌ని ఇస్రో చైర్మ‌న్(ISRO Chairman) వెల్ల‌డించారు.

దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో విద్యార్థులు ప్ర‌త్య‌క్షంగా చంద్ర‌యాన్ -3 ఎగురుతున్న దానిని వీక్షించారు. మ‌రో వైపు పెద్ద ఎత్తున మేరా భార‌త్ మ‌హాన్ అంటూ నినాదాలు చేశారు. భార‌త్ కూడా ప్ర‌పంచానికి తీసి పోద‌ని నిరూపించారంటూ కొనియాడారు. మ‌రో వైపు దేశ వ్యాప్తంగా చంద్ర‌యాన్ -3 నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకు వెళ్ల‌డంతో సంబురాలు చేసుకుంటున్నారు.

Also Read : Chandrayan-3 Launch : నింగిలోకి దూసుకెళ్లిన చంద్ర‌యాన్-3

Leave A Reply

Your Email Id will not be published!