KC Venugopal : మణిపూర్ పై మోదీ మౌనమేల
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
KC Venugopal : పదే పదే విదేశాలలో పర్యటిస్తున్న మోదీకి దేశంలో మణిపూర్ కాలిపోతున్నా ఇప్పటి వరకు మౌనం వీడడం లేదంటూ మండిపడ్డారు ఏఐసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని పేర్కొన్నారు. ఇంత జరిగినా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా చర్యలు తీసుకోవడంపై ఫోకస్ పెట్టలేదన్నారు కేసీ వేణుగోపాల్.
ఇప్పటి వరకు జాతుల ఘర్షణలో 100 మందికి పైగా చని పోయారని, 300 మందికి పైగా గాయపడ్డారని, 50 వేల మందికి పైగా వలస బాట పట్టారని కేసీ వేణుగోపాల్(KC Venugopal) వాపోయారు. 10 వేల మందికి పైగా బలగాలను మోహరించినా ఇప్పటి వరకు కంట్రోల్ లోకి రాక పోవడం బాధ కలిగిస్తోందన్నారు.
బాధితులకు తమ పార్టీ అండగా ఉందన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మణిపూర్ ను సందర్శించారని, బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారని తెలిపారు. కానీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోదీ బాధ్యత లేకుండా స్పందించక పోవడం భావ్యం కాదన్నారు కేసీ వేణుగోపాల్. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
Also Read : Maaveeran Movie : మావీరన్ కు భారీ ఓపెనింగ్స్