Gopal Rai : ఢిల్లీని ముంచేందుకు బీజేపీ కుట్ర
ఆప్ మంత్రి గోపాల్ రాయ్ కామెంట్స్
Gopal Rai : భారీ వర్షాలు ఇంకా ఢిల్లీని వెంటాడుతున్నాయి. దేశ రాజధానిలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం , కేంద్రంలోని మోదీ సర్కార్ కు మధ్య వార్ కొనసాగుతోంది. ఢిల్లీలో పెద్ద ఎత్తున నీళ్లు చేరడానికి ప్రధాన కారణం కేంద్రం అంటూ ఆప్ ఆరోపించింది.
శనివారం ఆ పార్టీకి చెందిన పర్యావరణ, అభివృద్ది, సాధారణ పరిపాలన శాఖా మంత్రి గోపాల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ నగరాన్ని ముంచేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఢిల్లీలో వర్షం పడక పోతే యమునా మట్టం ఎందుకు అంత ఎక్కువగా ఉందంటూ ప్రశ్నించారు గోపాల్ రాయ్(Gopal Rai). నిజం తెలిసి ఢిల్లీని బద్నాం చేసేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోందంటూ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వరద నీరు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా ఢిల్లీ వైపు మళ్లించేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల జన జీవనం స్తంభించి పోయిందన్నారు.
తాజాగా గోపాల్ రాయ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మొత్తంగా ఆప్ వర్సెస్ కేంద్రం చివరకు వర్షం దాకా పాకడం గమనార్హం.
Also Read : Varudu Kalyani : మహిళా ద్రోహి చంద్రబాబు – కళ్యాణి