RS Praveen Kumar : దొర పాలన అస్తవ్యస్తం – ఆర్ఎస్పీ
విద్యుత్ సరఫరాలో అంతరాయం
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ ను సందర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కనెక్షన్ లేకుండా చీకట్లో చాలా మంది బతుకుతున్నారని కానీ దొరనేమో అంతా విద్యుత్ ఇస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
పునర్నిర్మాణం నుండి శిథిలావస్థకు తిరోగమనం ఇదే కేసీఆర్ పాలనాలో తెలంగాణ ప్రస్థానం అంటూ ఎద్దేవా చేశారు బీఎస్పీ చీఫ్. పేదలకు , రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడంలో తప్పు లేదన్నారు. కానీ దీని పేరుతో బడా బాబులకు, వ్యాపారవేత్తలకు , కంపెనీలకు ఇస్తేనే ప్రమాదమన్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెప్పినది ఏదీ చేపట్టిన దాఖలాలు లేవన్నారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేయడం పనిగా సీఎం పెట్టుకున్నాడంటూ ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సంక్షేమ పథకాల పేరుతో ఓట్లను కొల్లగొట్టడం తప్ప ఇప్పటి దాకా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. విద్యా, ఆరోగ్య రంగం కుంటు పడిందన్నారు.
Also Read : Rahul Gandhi Modi : మౌదీ మౌనం రాహుల్ ఆగ్రహం