Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు

తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త బాంధ‌వులు

Tirumala Rush : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా వినుతికెక్కిన తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. వేస‌వి సెల‌వులు ముగిసినా, జూలై మాసం పూర్తి కావ‌స్తున్నా అంత‌కంత‌కూ తాకిడి పెరుగుతోంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఇక ద‌ర్శ‌నానికి పెద్ద ఎత్తున త‌ర‌లి రావ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ఇదే స‌మ‌యంలో టీటీడీకి భారీ ఎత్తున కానుక‌లు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌డం విశేషం. ఇక ద‌ర్శ‌నానికి సంబంధించి చూస్తే తిరుమ‌ల‌కు నిన్న ఒక్క రోజే ఏకంగా 86 వేల‌కు పైగా ద‌ర్శించుకున్నారు భ‌క్తులు. మొత్తం 86 వేల 170 మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

31 వేల 128 మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి స‌మ‌ర్పించుకున్నార‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) వెల్ల‌డించింది. ఇక భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు, విరాళాల ప‌రంగా హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపింది టీటీడీ.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల నిండి పోయింది. మొత్తం 31 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు భ‌క్త బాంధ‌వులు. స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగేందుకు 24 గంట‌ల‌కు పైగా ప‌ట్ట‌నుంద‌ని అంచ‌నా.

Also Read : Pawan Kalyan CI : ప‌వ‌న్ తిరుప‌తి టూర్ పై ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!