Mamata Banergee DK : దీదీకి డీకే గ్రాండ్ వెల్ కమ్
విపక్షాల కూటమి భేటీకి హాజరు
Mamata Banergee DK : అందరి కళ్లు ఇప్పుడు బెంగళూరుపై పడ్డాయి. కారణం ఏమిటంటే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు క్యూ కట్టారు. ఇవాళ , రేపు 17, 18న విపక్షాల కూటమి కీలక సమావేశం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేరుకున్నారు. తాజాగా టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banergee DK) బెంగళూరుకు చేరుకున్నారు.
హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సీఎం మమతా బెనర్జీకి సాదర స్వాగతం పలికారు కర్ణాటక పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మొత్తం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఐఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే 26 పార్టీలను రావాల్సిందిగా ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఒక్కరొక్కరు వస్తున్నారు.
అంతకు ముందు విపక్షాల కీలక సమావేశం జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలో బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. తొలి సమావేశం ముగిసింది. పేట్రియాట్రిక్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరు కూడా పెట్టారు. మొత్తంగా రాబోయే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతో విపక్షాలన్నీ ఏకం కావాలని నిర్ణయానికి వచ్చాయి·
ఇదిలా ఉండగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ రాచరిక పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే మంత్రి పొన్ముడి, ఎంపీ పై ఏకకాలంలో ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read : MK Stalin : ఎన్ని దాడులు చేసినా భయపడం