Teegala Krishna Reddy : త్వరలో హస్తం గూటికి ‘తీగల’
బీఆర్ఎస్ కు బిగ్ షాక్
Teegala Krishna Reddy : అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని దెబ్బ తగిలింది. పలు చోట్ల పార్టీకి చెందిన ముఖ్య నేతలు పక్క చూపులు చూస్తున్నారు. టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. పలుమార్లు సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే సీట్లు ఇస్తానంటూ ప్రకటించారు. చాలా ప్రాంతాలలో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదన్న టాక్ ఉంది. ఈ తరుణంలో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారు.
Teegala Krishna Reddy To be Joined
తాజాగా హైదరాబాద్ నగరంలో మంచి పట్టు కలిగి ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి(Teegala Krishna Reddy). మహేశ్వరం శాసన సభ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు తన తో పాటు తన కోడలు , రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డితో కలిసి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ మేరకు చాలా సేపు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా తీగల జంప్ కావడం ఒక రకంగా బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.
Also Read : Pawan Kalyan : బీజేపీతో జనసేన పొత్తు – పవన్ కళ్యాణ్