Madhu Yashki : చిల్లర భాష మానుకో కేటీఆర్ – మధు యాష్కి
రాహుల్ గాంధీ ఎక్కడ నువ్వు ఎక్కడ
Madhu Yashki : మంత్రి కేటీఆర్ చిల్లర భాష మానుకోవాలని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు నిజామాబాద్ మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. బుధవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజల కోసం తన వాయిస్ వినిపిస్తున్న ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. దీనిని ఎంత మాత్రం సహించ బోమంటూ స్పష్టం చేశారు.
Madhu Yashki Slams
ఎవరి కథ కమిటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరు ఎవరి కాళ్ల మీద పడ్డారో వారి అంతరాత్మకు తెలియదా అంటూ మధు యాష్కి గౌడ్(Madhu Yashki) ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరూ ఊరుకోబోరంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కోరి కొని తెచ్చుకున్న తెలంగాణను సర్వ నాశనం చేసిన ఘనత నీకు, నీ తండ్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీదన్నారు. కానీ ఆ కృతజ్ఞతను మరిచి పోయిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతూ తమను తాము దిగజార్చు కుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
కొద్ది రోజులు ఆగితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో తేలుతుందన్నారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్.
Also Read : YS Sharmila slams KCR : మాట తప్పడంలో కేసీఆర్ దిట్ట – షర్మిల