Janasena Slams : ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీకి జనసేన పార్టీకి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఆమె చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగింది జనసేన పార్టీ . వ్యక్తిగతంగా ఎలా వ్యాఖ్యానిస్తారంటూ మండిపడింది. ఇలాగేనా ఒక బాధ్యత కలిగిన మంత్రివై ఉండి అనరాని మాటలు అంటావా పవన్ కళ్యాణ్ గురించి.
Janasena Slams To
మురికి తొట్టి లాంటిది నీ నోరంటూ వ్యక్తిగత దూషణకు దిగింది జనసేన(Janasena) పార్టీ. మీడియా ముందు నీతులు వల్లించడం కాదు నువ్వు ఏమిటో, నీ స్థాయి ఏమిటో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసని పేర్కొంది పార్టీ. ఇప్పటి వరకు మంత్రిగా రాష్ట్రంలో ఏం సాధించావో చెప్పాలని డిమాండ్ చేసింది. ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ పర్యాటక మంత్రిని నిలదీసింది. పలు ప్రశ్నలు సంధించింది.
పవన్ కళ్యాణ్ గురించి ఇంకోసారి నోరు జారితే బావుండదంటూ హెచ్చరించింది పార్టీ. నువ్వు రాష్ట్ర మంత్రిగా ఉంటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అంటూ పేర్కొంది. ఈ సందర్బంగా పలు ప్రశ్నలు సంధించింది. టూరిజం కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.
ఉత్తరాంధ్రలో అరసవల్లి, శ్రీ కూర్మం లాంటి దేవాయలాలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు, అరకు వ్యాలీ, లంబసింగం లాంటి వాటి ప్రాంతాల అభివృద్దికి ఏం చర్యలు తీసుకున్నారో బహిరంగంగా చెప్పాలని కోరింది. ఇక యువజన శాఖ మంత్రిగా ఉన్న మీరు యువత కోసం ఏం చేశారో చెప్పాలని పేర్కొంది జనసేన పార్టీ.
Also Read : Project-K First look : ప్రాజెక్టు కె ఫస్ట్ లుక్ అదుర్స్