Heavy Rains AP Telangana : మరికొన్ని రోజులు భారీ వర్షాలు
ఉప్పొంగుతున్న గోదావరి
Heavy Rains AP Telangana : వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. తూర్పు బంగాళా ఖాతం దాకా రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న మరో ఐదు రోజుల పాటు అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. సహాయక ఏర్పాట్లు చేయాలని, ఎవరూ ఇబ్బందులు పడకుండా చూడాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇరు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో రోజును కూడా పెంచే ఛాన్స్ లేక పోలేదు. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనం ఇస్తున్నాయి. రోడ్లన్నీ నిండి పోయాయి. చెరువులు, కుంటలు నిండాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Heavy Rains AP Telangana & Coastal regions
భారీ వర్షాల తాకిడికి గోదావరికి వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 43.9 అడుగులకు చేరింది. పోలవరం వద్ద 11.97 మీటర్లకు నీటి మట్టం పెరగడంతో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్వేక్షింస్తోంది వాతావరణ శాఖ. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులకు చేరింది. గోదావరి పరీవాహక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
Also Read :Kanguva Movie : సర్వత్రా కంగువపై ఉత్కంఠ