G Kishan Reddy : భాగ్య‌లక్ష్మి గుడిలో కిష‌న్ రెడ్డి పూజ‌లు

బీజేపీ చీఫ్ గా ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం

G Kishan Reddy : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ గా ఎన్నికైన గంగాపురం కిష‌న్ రెడ్డి(G Kishan Reddy) శుక్ర‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంత‌కు ముందు ఆయ‌న హైద‌రాబాద్ చార్మినార్ లో కొలువై ఉన్న‌ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు. అక్క‌డ భాగ్య‌ల‌క్ష్మి దేవ‌త‌కు పూజ‌లు చేశారు. అనంత‌రం అక్క‌డి నుంచి మ‌హాత్మా జ్యోతిబా పూలే విగ్ర‌హానికి పూల‌మాలలు వేశారు.

G Kishan Reddy Taken

నేరుగా అమ‌ర వీరుల స్థూపం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అమ‌రవీరుల‌కు నివాళులు అర్పించారు. అమ‌ర వీరుల బ‌లిదానాలు, త్యాగాల ఫ‌లితంగా తెలంగాణ ఏర్ప‌డింద‌న్నారు. ఇవాళ వారి పేరు చెప్పి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన క‌ల్వ‌కుంట కుటంబం ప‌వ‌ర్ లోకి వ‌చ్చింద‌ని ధ్వ‌జ‌మెత్తారు బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి.

ఆయ‌న వెంట బీజేపీ ఎన్నిక‌ల క‌మిటీ చైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్ , దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఉన్నారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో బీజేపీ హైక‌మాండ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ని తీసేసింది. ఆయ‌న స్థానంలో కేంద్ర కేబినెట్ లో ఉన్న కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో ఇవాళ ముహూర్తం నిర్ణ‌యించుకుని బీజేపీ చీఫ్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Also Read : Kathi Karthika Goud : దొర పాల‌న‌లో పేద‌ల‌కు ఇళ్లేవి

Leave A Reply

Your Email Id will not be published!