YS Sharmila Viveka : నా వ‌ద్ద ఆధారాలు లేవు – ష‌ర్మిల‌

వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో వాంగ్మూలం

YS Sharmila Viveka: తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి. ఆయ‌న స్వ‌యంగా ఏపీ సీఎంకు బాబాయి. ఈ కేసులో ఇప్ప‌టికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ప్ర‌శ్నించింది సీబీఐ. తాజాగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) వాంగ్మూలం ఇచ్చారు. త‌న వ‌ద్ద కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవ‌న్నారు. ఈ హ‌త్య కేసులో 259వ సాక్షిగా సీబీఐ ఎదుట హాజ‌రైంది వైఎస్ ష‌ర్మిల‌.

YS Sharmila Viveka Case

రాజ‌కీయ కార‌ణాల‌తోనే వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగింది. హ‌త్య‌కు కుటుంబ‌, ఆర్థిక వ్య‌వ‌హారాలు కార‌ణం కానే కాద‌న్నారు. మ‌రో పెద్ద కార‌ణం ఉండి ఉండ‌వ‌చ్చ‌న్నారు. అవినాష్ కుటుంబానికి వ్య‌తిరేకంగా వైఎస్ వివేకానంద రెడ్డి నిల‌బ‌డ‌టమే కార‌ణం కావ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వారికి అడ్డు వ‌స్తున్నార‌ని మ‌న‌సులో పెట్టుకుని ఉండ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

హ‌త్య‌కు కొన్ని నెల‌ల ముందు బెంగ‌ళూరులోని మా ఇంటికి వ‌చ్చారు. క‌డ‌ప ఎంపీగా పోటీ చేయాల‌ని న‌న్ను అడిగార‌ని తెలిపారు. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయొద్ద‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పార‌న్నారు. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా జ‌గ‌న్ రెడ్డిని ఒప్పిద్దామ‌న్నారు. జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా తాను వెళ్ల‌న‌ని వివేకానంద రెడ్డి ఆలోచించార‌ని అన్నారు. జ‌గ‌న్ నాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌రని తెలుసు. ఎంపీగా మొద‌ట తాను ఒప్పు కోలేద‌న్నారు.

Also Read : Bandi Sanjay : ఇక‌నైనా ఫిర్యాదులు ఆపండి – బండి

Leave A Reply

Your Email Id will not be published!