Rajasthan Minister Sacked : రక్షణ లేదన్న మంత్రిపై వేటు
రాజస్థాన్ సీఎం సంచలన నిర్ణయం
Rajasthan Minister Sacked : రాజస్థాన్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది. శాసనసభ వేదికగా ఆ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర గుడ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం ఎక్కడో ఉన్న మణిపూర్ రాష్ట్రం గురించి ప్రస్తావిస్తున్నాం..కానీ మన రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదని వాపోయారు. సాక్షాత్తు కేబినెట్ లో ఉన్న మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. చర్చకు దారి తీశాయి. సోసల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Rajasthan Minister Sacked Rajendra Guda
దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి రాజేంద్ర గుడ పై వేటు వేశారు. వెంటనే కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలో ఉండి కూడా మహిళలను కాపాడ లేక పోతున్నామని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం అశోక్ గెహ్లాట్. మన ప్రభుత్వ పాలన ఎలా ఉందనే దానిపై మనం ఓసారి అద్దంలో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు రాజేంద్ర గుడ. మంత్రిని తొలగించడంపై భారతీయ జనతా పార్టీ దాడికి దిగింది. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో తాము చెపితే నమ్మ లేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
Also Read : ABVP Leaders Attack : పోలీసులపై ఏబీవీపీ కార్యకర్తల దాడి